భారత్‌కు ప్రపంచ బ్యాంకు వంద కోట్ల డాలర్ల ప్యాకేజీ
ప్రపంచ బ్యాంకు.. భారీ ప్రకటన చేసింది. సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద భారత్‌కు సుమారు వంద కోట్ల డాలర్లు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్యాకేజీ లింకై ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. సోషల్ ప్రొటెక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నది. క్యాష్ ట్రాన్సఫర్ల విధానం చాలా కీలకమైందని, దాని వల్ల జీవణ ప్రమాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు. బ్రతకడానికి ఇతర మార్గాలు కష్టమైనప్పుడు, ఇది సులవైన విధానం అని ఆయన తెలిపారు.
భారత ప్రభుత్వంతో మూడు రంగాల్లో వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోనున్నట్లు వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరక్టర్ జునైద్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ, చిన్నమధ్యతరహా పరిశ్రమల కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 81,970కు చేరుకున్నాయి.మరణించిన వారి సంఖ్య 2649కు చేరకున్నది. లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో .. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 44 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 3 లక్షల మంది మరణించారు.