అల్లు అర్జున్ సినీ ప్రస్థానం..
అల్లు అర్జున్ దక్షిణాది సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రాంచరణ్, అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. అల్లు అర్జున్ భార్య పేరు స్నేహారెడ్డి. వీరి పిల్లలు అయాన్,అర్హ . అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...
అల్లు అర్జున్ మొదటి చిత్రం విజేత. విజేత సినిమాలో చిరంజీవి మేనల్లుడిగా నటించాడు. ఇతర్జున్ హీరో గా నటించిన మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి.
అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు
నటించిన చిత్రాలు
సంవత్సరం | చిత్రం | పా త్ర | కథానాయిక | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1985 | విజేత | బాల నటుడిగా | ||
1986 | స్వాతిముత్యం | బాల నటుడిగా | ||
2001 | డాడీ | గొపి | అతిథి పాత్రలో | |
2003 | గంగోత్రి | సింహాద్రి | అదితి అగర్వాల్ | విజేత, సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004) |
2004 | ఆర్య | ఆర్య | అనురాధా మెహతా | విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2004) |
2005 | బన్ని | రాజా/బన్ని | గౌరీ ముంజల్ | |
2006 | హ్యాపీ | బన్ని | జెనీలియా | |
2007 | దేశముదురు | బాల గోవిందం | హన్సికా మోట్వాని, రంభ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2007) |
శంకర్‌దాదా జిందాబాద్ | అతిథి పాత్రలో | |||
2008 | పరుగు | కృష్ణ | షీలా | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008) విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008) |
2009 | ఆర్య 2 | ఆర్య | కాజల్ అగర్వాల్ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2009) |
2010 | వరుడు | సందీప్ | భానుశ్రీ మెహ్రా | |
వేదం | కేబుల్ రాజు | అనుష్క శెట్టి, దీక్షా సేథ్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2010) | |
2011 | బద్రీనాధ్ | బద్రీనాధ్ | తమన్నా | |
2012 | జులాయి | రవీంద్ర నారాయణ్ | ఇలియానా | |
2013 | ఇద్దరమ్మాయిలతో | సంజు రెడ్డి | అమలా పాల్, కేథరీన్ థెరీసా | |
2014 | ఇ యమ్ తట్ చేంజ్ | లఘు చిత్రం, నిర్మాత కూడా | ||
రేసుగుర్రం | అల్లు లక్ష్మణ్ ప్రసాద్/ లక్కి | శృతి హాసన్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2014) | |
ఎవడు | సత్య | కాజల్ అగర్వాల్ | కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు. | |
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | విరాజ్ ఆనంద్ | సమంత, నిత్య మీనన్, అదా శర్మ | |
రుద్రమదేవి | గోన గన్నా రెడ్డి | అనుష్క శెట్టి, కేథరీన్ థెరీసా | ||
2016 | సరైనోడు | గణ | రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెరీసా | |
2017 | దువ్వాడ జగన్నాధం | దువ్వాడ జగన్నాధం / డి.జె. | పూజా హెగ్డే | |
2018 | నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | సూర్యా | అను ఇమ్మాన్యుయేల్ | |
2019 | అల వైకుంఠంపురంలో | పూజా హెగ్డే | Yet Not released |